Missing: రాష్ట్రంలో మరో సంచలనం.. ఒకేసారి ముగ్గురు బాలికలు మిస్సింగ్

రాష్ట్రంలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది.

Update: 2025-01-03 05:01 GMT
Missing: రాష్ట్రంలో మరో సంచలనం.. ఒకేసారి ముగ్గురు బాలికలు మిస్సింగ్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఏకంగా ముగ్గురు బాలికలు ఒకేసారి కనబడకుండాపోవడం నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో కలకలం రేపుతోంది. నవీపేట్ (Navipet) మండల కేంద్రానికి చెందిన ముగ్గురు బాలికలు గురువారం ఉదయం పాఠశాలకు వెళ్తున్నామని ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లారు. అయితే, సాయంత్రం అయినా.. వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలికల తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికల జాడ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News