గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపాలి
ఆర్మూర్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో గంజాయి విక్రయలు జోరుగా సాగుతున్నాయని,పోలీసులు వాటినీ అరికట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరెపల్లి సాయిలు అన్నారు.
దిశ, ఆలూర్ : ఆర్మూర్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో గంజాయి విక్రయలు జోరుగా సాగుతున్నాయని,పోలీసులు వాటినీ అరికట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరెపల్లి సాయిలు అన్నారు. శనివారం ఆర్మూర్ ఏసీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో సాయిలు మాట్లాడుతూ..ఒక్కప్పుడు సినిమాల్లో మాత్రమే గంజాయి అంటే చూసేవాళ్ళమని కానీ..ఇప్పుడు ఏకంగా ఆర్మూర్ డివిజన్ కేంద్రంలోనే కాకుండా మండలాల నుండి పల్లెల్లో కూడా గంజాయి విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని అన్నారు. వాటిని అరికట్టాలని యువత, విద్యార్థులు, గంజాయి,మత్తు పదార్థాలకి అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. గంజాయి సేవించిన మత్తులో తల్లిదండ్రులపై దాడులకు దిగుతున్నారని,తక్షణమే గంజాయి విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపాలని కోరారు. అలాగే నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్నందున యువత చెడు మార్గాలలో వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, గంజాయిని అరికట్టెందుకు పోలీసులు భద్రత పెంచాలని ఏసీపీని కోరారు. ఈ కార్యక్రమం లో శ్రీను,నరేష్,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.