ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీ
ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ క్రాసింగ్ రోడ్డు 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి
దిశ ,ఆర్మూర్ : ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ క్రాసింగ్ రోడ్డు 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఆర్మూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంలో గాయపడ్డ ముగ్గురు వ్యక్తులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రులలో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది.