చైన్ స్నాచింగ్ కలకలం..మహిళ మెడలో చైన్ అపహరణ

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో శనివారం రాత్రి

Update: 2024-12-29 05:10 GMT

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో శనివారం రాత్రి చైన్ స్నాచింగ్ సంఘటన కలకలం రేపింది. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోటార్ మూర్ ఏరియాలో రోడ్డుపై వెళ్తున్న మహిళ రితిక మెడలో నుంచి గుర్తు తెలియని దుండగులు బ్లూ కలర్ స్కూటీపై వచ్చి రెండు తులాల బంగారు గొలుసును తెంపుకొని ఎత్తుకెళ్లారు. ఆ రోడ్డుపై వెళ్తూ చైన్ స్నాచింగ్ గురైన బాధిత మహిళ రితిక లబోదిబోమని మొత్తుకుంది. బ్లూ కలర్ స్కూటీపై వచ్చి రోడ్డుపై చైన్ స్నాచింగ్ కు పాల్పడిన గుర్తు తెలియని దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న ఆర్మూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక కాలనీ వాసులతో కలిసి ఆ ఏరియాలోని పరిసరాలను వాకబు చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్, ఎస్సైలు ఇంద్రకరణ్ రెడ్డి, మహేష్, గోవింద్ లు తెలిపారు.


Similar News