రైతు ప్రాణం తీసిన చేను కంచె
రైతు తన చేనులోని పంటలను అటవీ జంతువుల బారి నుండి కాపాడేందుకు సోలార్ ఫిన్సింగ్ వేశాడు.
దిశ, ఖానాపూర్ : రైతు తన చేనులోని పంటలను అటవీ జంతువుల బారి నుండి కాపాడేందుకు సోలార్ ఫిన్సింగ్ వేశాడు. కానీ ఆ కంచే ఆ రైతు ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కపూర్ గ్రామానికి చెందిన ఓడ్నాల భీమన్న (64) అనే రైతు గంగాయిపేట ప్రాంతంలోని తన పంట చేనులోని కూరగాయల పంటలను కాపాడు కోవడం కోసం చేను చుట్టూ ( కంచె) సోలార్ ఫిన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. సోమవారం సాయంత్రం ఆయన సోలార్ వైరు పై పడడంతో రైతు మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఖానాపూర్ ఎస్ఐ రాహుల్ తెలిపారు.