పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య
ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
దిశ, తిమ్మాపూర్ : ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోలంపల్లి గ్రామానికి చెందిన బొంగాని రమ్య (25) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా ఆమె అత్తింటి వారు ఆమెను చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రి కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.