సీన్ రీ‌కన్‌స్ట్రక్షన్..వారిని కాపాడబోయి తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ఎస్సై..?

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముగ్గురి డెత్ మిస్టరీ ని

Update: 2024-12-29 04:00 GMT

దిశ, భిక్కనూరు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముగ్గురి డెత్ మిస్టరీ ని ఛేదించేందుకు రీ కన్ స్ట్రక్షన్ విచారణ మొదలుపెట్టారు. సూసైడ్ చేసుకున్న కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్దకు వెళ్లి విచారణ బృందం డెడ్ బాడీలు దొరికిన చోట బృందం సభ్యులు నీటిలో దిగి నీటి శాంపిళ్లను సేకరించి,ఏ సమయంలో చెరువులో దూకి ఉంటారన్న విషయమై ఆరా తీస్తున్నారు. అయితే ఎస్ఐ వాహనానికి సంబంధించి సైడ్ డోర్ గ్లాసులకు బ్లాక్ పేపర్ ఉండటం వలన, అందులో ఎవరెవరు ఉన్నారన్నది సీసీ ఫుటేజ్ లో సరిగా కనిపించడం లేదని తెలుస్తోంది.

కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే సమస్యను, గొడవ చేసుకొని క్షణికావేశంతో తొందరపడి ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సూసైడ్ చేసుకునేంత పిరికివాడు ఎస్సై సాయి కుమార్ కాదని, చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్ శృతి, సొసైటీలో పనిచేసే ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ను కాపాడబోయే ప్రయత్నంలో యాక్సిడెంట్ డెత్ గా ఎస్సై సాయి కుమార్ మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. భిక్కనూరు పోలీస్ స్టేషన్ నుంచి నాలుగు రోజుల క్రితం 11:30 గంటలకు తన సొంత వాహనంలో బయటకు బయలుదేరిన ఎస్సై సాయి కుమార్, బీబీపేటలో డ్యూటీ ముగించుకుని తన స్వగ్రామమైన గాంధారికి వెళుతున్న మహిళా కానిస్టేబుల్ శృతిని, బీబీపేట సొసైటీలో పనిచేసే ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ను పొందుర్తి శివారులో పికప్ చేసుకుని వెళ్లినట్లు సమాచారం.

కొద్దిసేపు మాట్లాడి మహిళా కానిస్టేబుల్ గాంధారి ఎక్స్ రోడ్ వద్ద దించేసి, తిరిగి రిటర్న్ రావచ్చన్న ఉద్దేశంతో సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి సమీపంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లినట్టు చెబుతున్నారు. అయితే ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకునేందుకు, ఆ ప్లేస్ కరెక్ట్ కాకపోవడం, క్షణికావేశంతోనే సూసైడ్ చేసుకొని ఉండవచ్చన్నది మరో వాదన. ఆ ప్లేస్ కాకుండా ఎక్కడో ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటే, ఈ సూసైడ్ ఆలోచన వారికి వచ్చేది కాదేమోనని అందరూ సేఫ్ గా ఉండేవారేమోనన్నా చర్చ ప్రజల్లో నెలకొంది.

కాల్ డేటా సరిగా ఓపెన్ కావడం లేదా...?

ముగ్గురి ఆత్మహత్యలకు సంబంధించి కాల్ డేటా సరిగా ఓపెన్ కాకపోవడం వల్లే విచారణకు ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి పోలీస్ యంత్రాంగానికి ఉన్న పరిజ్ఞానంతో కాల్ డేటాను ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, పూర్తిగా ఓపెన్ కాలేక పోతుండడంతో రాజధాని లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ ఆత్మహత్యల కేసు విషయమై పోలీస్ అధికార యంత్రాంగం, మాత్రం వారు చేస్తున్న దర్యాప్తు వివరాలు బయటకు తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు.

అలా ఎలా జరిగింది...?

చెరువులో పడి వాళ్లు అట్లెట్ల ఆత్మహత్య చేసుకున్నారని జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే విషయమై ఆరా తీస్తూ, వాడి వేడిగా చర్చించుకుంటున్నారు. తొందరపడి ఆత్మహత్యలు చేసుకొని కుటుంబాలను బాధ పెట్టవద్దని, చాలామందికి కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యం నూరిపోసిన ఎస్సై సాయి కుమార్ సూసైడ్ చేసుకోవడం ఏమిటన్న ప్రశ్న ఆయనను దగ్గర నుండి చూసిన వారితో పాటు, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వివిధ రకాల సమస్యలతో బాధపడుతూ, స్టేషన్ హౌస్ లో తన వద్దకు వచ్చే వారిని, ఆత్మహత్యలు చేసుకోవద్దని నొక్కి మరి చెప్పే ఆయన సూసైడ్ చేసుకున్నాడంటే అస్సలు నమ్మలేకపోతున్నారు.


Similar News