KA Paul: కవితకు బీసీలు ఇప్పుడు గుర్తుకొచ్చారా..? కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha)కు ఎన్నికలు(Elections) అనగానే బీసీలు(BCs) గుర్తుకొచ్చారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు(Prajashanthi Party President) కేఏ పాల్(KA Paul) అన్నారు.

Update: 2024-12-30 11:50 GMT

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha)కు ఎన్నికలు(Elections) అనగానే బీసీలు(BCs) గుర్తుకొచ్చారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు(Prajashanthi Party President) కేఏ పాల్(KA Paul) అన్నారు. నిజామాబాద్(Nijamabad) జిల్లా సర్పంచుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు. ఆయన మాట్లాడుతూ.. కవిత బీసీ నినాదం తీసుకోవడం విడ్డూరంగా ఉందని, స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే ఆమెకు బీసీలు గుర్తుకు వచ్చారని అన్నారు. మీ నాన్న, అన్న, మీ కుంటుంబం బీసీలు కాదని, మీరు వెలమలు అని గుర్తుచేశారు.

అంతేగాక మిమ్మల్ని దొరలు అంటారని, కానీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని దొంగలు అంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో(BRS Governance) ఏడు లక్షల కోట్ల అప్పు చేశారని, బంగారు తెలంగాణను తీసుకొని, దరిద్ర, అక్రమ, అవినీతి రాష్ట్రంగా మార్చారని ఆరోపణలు చేశారు. మీ పాలనలో మొత్తం ఎనిమిది లక్షల కోట్లు మాయం అయ్యాయని, అవి ఏమయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ముంచేసి, ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకొని సర్పంచుల ఎన్నికలకు వెళుతున్నారని మండిపడ్డారు. బీసీలారా బయటికి రావాలని ఈ రాజకీయ ఉచ్చుల నుంచి బయటపడాలని పిలుపునిచ్చారు. అంతేగాక స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీని ఆశీర్వదించాలని పాల్ కోరారు. 

Tags:    

Similar News