నిజాంసాగర్‌ నుంచి నీటి విడుదల

కామారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఒక వరద గేటు ఎత్తివేసి 3500 క్యూసెక్కుల నీటిని మాంజీరాలోకి వదిలిపెడుతున్నట్లు నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటిపారుదలశాఖ ఏఈ శివ ప్రసాద్ తెలిపారు.

Update: 2023-09-22 15:44 GMT

దిశ,నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఒక వరద గేటు ఎత్తివేసి 3500 క్యూసెక్కుల నీటిని మాంజీరాలోకి వదిలిపెడుతున్నట్లు నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటిపారుదలశాఖ ఏఈ శివ ప్రసాద్ తెలిపారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా ప్రస్తుతం 1405.00 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను పూర్తి నీటినిల్వతో కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఆయకట్టు పరిధిలోని రైతులు, గొర్రెలు, పశువుల కాపర్లు వరద కాలువ వెంట వెళ్లరాదని వారు సూచించారు. 

Tags:    

Similar News