శ్రీతేజ్‌ను పరామర్శించిన ఈటెల రాజేందర్,పైడి రాకేష్ రెడ్డి

సంధ్య థియేటరల్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీ తేజ్ ను,వారి కుటుంబ సభ్యులను మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి లు మంగళవారం పరామర్శించారు.

Update: 2024-12-24 14:24 GMT

దిశ, ఆర్మూర్ : సంధ్య థియేటరల్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీ తేజ్ ను,వారి కుటుంబ సభ్యులను మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి లు మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ..తనకు వ్యక్తిగతంగా సినిమాలు అంటే ఇష్టం కానీ, ఇటీవల సినిమాలు సరైన విధంగా లేకపోవడంతో యువతకు తప్పుడు సమాచారం వెళ్తుందన్నారు. ఈ విషయం పుష్ప సినిమా రిలీజ్ ముందే నేను చెప్పినట్లు రాకేష్ రెడ్డి గుర్తు చేశారు. ఇది కేవలం కల్పితమని పేపర్ ప్రకటన ఇవ్వాలని నేను కోరను అని అన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ దుర్ఘటన జరిగిందన్నారు. శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, పూర్తి ఆరోగ్యంతో ఉంటాడని అన్నారు. శ్రీ తేజ్ కుటుంబానికి అన్ని విధాలుగా అల్లు అర్జున్ అండగా ఉండాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరారు.


Similar News