నిరుపేదలకు వరం గృహ జ్యోతి పథకం

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో భాగంగా నాలుగు గ్యారెంటీలను ప్రారంభించిన ప్రభుత్వం, గృహ జ్యోతి పథకం కింద నిరు పేదలకు లబ్ధి చేకూర్చే విధంగా అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది.

Update: 2024-03-01 12:28 GMT

దిశ, భిక్కనూరు : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో భాగంగా నాలుగు గ్యారెంటీలను ప్రారంభించిన ప్రభుత్వం, గృహ జ్యోతి పథకం కింద నిరు పేదలకు లబ్ధి చేకూర్చే విధంగా అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 35 వేల గృహ విద్యుత్ సర్వీస్ కనెక్షన్లు ఉండగా, లక్షా 88 వేల 425 సర్వీస్ కలెక్షన్లకు మార్చి నుంచి గృహ జ్యోతి పథకం కింద లబ్ధి చేకూరనుంది. 80 శాతం కనెక్షన్లకు మాత్రం ఫస్ట్ ఫేస్ లో పథకం అమలు కానుండడంతో మిగిలిన 20 శాతం వినియోగదారులకు సెకండ్ ఫేస్ లో పేర్లు నమోదు చేసుకొని వారికి కూడా ఫ్రీ కరెంటు అమలయ్యే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు.

    ఇంకా మిగిలిన 43 వేల విద్యుత్ కనెక్షన్లలో అర్హులను గుర్తించి రెండవ ఫేస్ లో వారికి లబ్ధి చేకూర్చే విధంగా యంత్రాంగం తలమునకలైంది. 200 యూనిట్లు దాటి ఒక్క యూనిట్ దాటినా ఫ్రీ కరెంట్ వర్తించకపోగా బకాయి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రేషన్ కార్డుల వివరాల ను ప్రామాణికంగా తీసుకోవడం, ఒక్క కుటుంబానికి ఒక్క కనెక్షన్ మాత్రమే ఈ పథకం కింద వర్తించే విధంగా మార్గదర్శకాలను రూపొందించింది.

    అదే విధంగా ఇల్లు గ్రామంలో ఉండి, ఇంటి యజమాని వేరేచోట నివాసం కానీ అద్దెకు కానీ ఉంటే ఏదో ఒకచోట గృహ జ్యోతి పథకం అమలయ్యే విధంగా ఆప్షన్ ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేసుకోకుండా మిస్ అయినవారు కొత్తగా దరఖాస్తు లు చేసుకునేందుకు డెడ్ లైన్ లు ఏమీ లేకపోయినప్పటికీ ఎప్పుడంటే అప్పుడు దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కల్పించింది. స్థానిక ఎంపీడీఓ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది.

గృహ జ్యోతి దరఖాస్తుకు రేషన్ కార్డు కీలకం...

సంక్షేమ పథకాలు లబ్ది పొందడానికి ప్రభుత్వం గతంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి దరఖాస్తులు స్వీకరించింది. దాంట్లో చాలామంది రేషన్ కార్డు లు లేకున్నా దరఖాస్తులు చేసుకున్నారు. ఆరు గ్యారంటీలు లబ్ధి పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి చేశారు. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు

    కొత్తవి మంజూరు చేయకపోవడం ఫుడ్ సెక్యూరిటీ కార్డును ఆధారం చేసుకొని, ఆరు గ్యారంటీల లబ్ధికోసం ఎదురుచూసిన చాలామందికి నిరాశే ఎదురవుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ స్కీంలు అమలు కావడానికి రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవాలని, రేషన్ కార్డు వచ్చిన తర్వాతనే ఆరు గ్యారెంటీలకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

ఇది నిరంతర ప్రక్రియ....

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆరు గ్యారంటీలకు లబ్ది చేకూరాలంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు (రేషన్ కార్డు)ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. చాలా సంవత్సరాలుగా కుటుంబంలోని అన్నదమ్ములు వేర్వేరుగా ఉన్నప్పటికీ, వివాహమైన కూతుర్ల పేర్లు సైతం ఇప్పుడు ఒకే ఫుడ్ క్యూరిటీ కార్డులో ఉండడంతో వారంతా ఆందోళనకు గురవుతున్న

    పరిస్థితి. ప్రతిరోజూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమకు వేర్వేరు రేషన్ కార్డులు మంజూరు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. ఆరు గ్యారంటీల పథకం అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రభుత్వం రేషన్ కార్డుల మంజూరుకు కృషి చేస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి వద్దని అధికారులు పేర్కొంటుండడం కొసమెరుపు. 

Similar News