బాలుడి ఆచూకీ లభ్యం…

సోమవారం సాయంత్రం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ రూరల్ పీఎస్ పరిధిలో అపహరణకు గురైన ఏడాదిన్నర బాలుడి ఆచూకీ మంగళవారం సాయంత్రం లభించింది

Update: 2024-02-06 14:35 GMT

దిశ, నిజామాబాద్ క్రైమ్ : సోమవారం సాయంత్రం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ రూరల్ పీఎస్ పరిధిలో అపహరణకు గురైన ఏడాదిన్నర బాలుడి ఆచూకీ మంగళవారం సాయంత్రం లభించింది. మోర్తాడ్ మండలంలోని ఓ కాల్వ పక్కన బాలుడిని గుర్తించినట్లు సమాచారం. ఓ బాలుడు అనుమానాస్పదంగా ఉన్నట్లు స్థానికులు మంగళవారం పోలీసులకు తెలియజేయగా.. మోర్తాడ్ పోలీసులు నిజామాబాద్ రూరల్ పీఎస్ కు సమాచారం ఇచ్చారు. కిడ్నాపర్లు బాలుడిని ఇక్కడ వదిలేసి పారిపోయినట్లు సమాచారం. గడిచిన వారం వ్యవధిలోనే మూడు కేసులు నమోదు కాగా.. ఈ మూడింటిని కూడా కమిషనరేట్ పోలీసులు చేధించారు.


Similar News