బాబోయ్..బిస్కెట్లలో ఇనుప తీగలు

బార్‌బన్ బిస్కట్ లో ఇనుప తీగ కనిపించిన ఘటన కలకలం సృష్టించింది .

Update: 2024-10-10 12:50 GMT

దిశ,కామారెడ్డి :  ఓ కంపెని బిస్కట్ లో ఇనుప తీగ కనిపించిన ఘటన కలకలం సృష్టించింది . కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దేవునిపల్లిలో స్థానికంగా ఉన్న దుకాణం నుంచి హనుమాన్ రెడ్డి అనే వ్యక్తి తన పిల్లల కోసం బిస్కెట్లు తీసుకెళ్ళాడు. పిల్లలు బిస్కెట్ తింటుండగా అందులో ఇనుప తీగ ప్రత్యక్షమయింది. దాంతో మోహన్ రెడ్డి అవాక్కయ్యాడు. తన పిల్లలు బిస్కట్ తింటుండగా..తీగ ప్రత్యక్షమైన ఘటనను వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పెట్టాడు. పిల్లలు తింటున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలని వీడియోలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Similar News