నిఘా నీడలేని ప్రభుత్వ పాఠశాల పనితీరు...

బర్రె కొని తలుగు కొనలేకపోయిన స్థితిలో ఉన్నట్టు ఉంది తెలంగాణ విద్యాశాఖ అధికారుల తీరు. కోట్లు పెట్టి విద్యార్థులకు సంబంధించిన సామగ్రిని పొందుపరిచి సెలవు దినాల్లో అటువైపు చూసే నాధుడు కరువయ్యాడు.

Update: 2024-10-10 13:53 GMT

దిశ గాంధారి: బర్రె కొని తలుగు కొనలేకపోయిన స్థితిలో ఉన్నట్టు ఉంది తెలంగాణ విద్యాశాఖ అధికారుల తీరు. కోట్లు పెట్టి విద్యార్థులకు సంబంధించిన సామగ్రిని పొందుపరిచి సెలవు దినాల్లో అటువైపు చూసే నాధుడు కరువయ్యాడు. కొనేటప్పుడు కోట్లు పెట్టి తలుగు దగ్గర బేరమాడినట్టు ఉంది అధికారుల తీరు.

ఐఎఫ్‌బీలకు రక్షణ ఏది?

కామారెడ్డి జిల్లా కేంద్రంలో దాదాపు 182 హైస్కూళ్లు ఉండగా అందులో 124 హైస్కూళ్లకు IFB (Integrated flat panel board)లను రాష్ట్రప్రభుత్వం అందించింది. ఒక్కో ఐఎఫ్‌బీ విలువ దాదాపు 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అయితే ప్రభుత్వ పాఠశాలకు బతుకమ్మ, దసరా సెలవులు ప్రకటించడంతో అక్టోబర్ 2 నుంచి 14 వరకు సెలవులు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఇంటిగ్రేటెడ్ ఫ్లాట్ ప్యానెల్ బోర్డు(IFB ) లకు రక్షణ, నైట్ వాచ్మెన్ నియామకంపై ‘దిశ’ పత్రిక విలేఖరి జిల్లా విద్యాశాఖ అధికారి రాజును సంప్రదించింది. IFBలకు రక్షణ, వాచ్ మెన్‌లపై వివరణ అడగగా.. ‘నాకేం తెలియదు’ అని చెప్పారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అందించిన విలువైన సామగ్రి పట్ల అధికారులకు ఎంత జాగ్రత్త ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఒకవేళ చోరీలు జరిగితే దానికి బాధ్యులు ఎవరని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వస్తుంది. స్కూళ్లలో ఆధునిక పరికరాలను చూసే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇలాంటి సమసయంలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఐఎఫ్‌బీల రక్షణపై నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

ఐఎఫ్‌బీలు విద్యార్థులకు ఎంతో ముఖ్యం...

ఐఎఫ్‌బీలలో ఆన్లైన్ క్లాసుల బోధన, బోర్డ్ ఆఫ్ స్కూల్ నిర్వహించే ఎగ్జామ్స్ మోడల్ పేపర్లు, యూఎస్‌బీతో కనెక్టింగ్, వైఫై కనెక్ట్, మొబైల్‌ను ఓపెన్ చేసుకోని చూసుకోవచ్చు. అంతేకాకుండా నార్మల్ బోర్డుగా, గణిత శాస్త్రం బోధించేటప్పుడు గ్రాఫ్‌లకు ఎంత అనువుగా ఉంటుంది. ఇంత ముఖ్యమైన పరికరాలకు రక్షణ కరువైందని విద్యార్థుల తల్లిందండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి సెలవు దినాలలో తప్పనిసరిగా ప్రతి ఒక్క ప్రభుత్వ హైస్కూల్ కు ఒక వాచ్మెన్ నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

నైట్ వాచ్మెన్ తప్పనిసరి అంటున్న ఎంఈఓ శ్రీహరి...

ప్రభుత్వ పాఠశాలల్లో విలువైన వస్తువులు ఉన్నప్పుడు నైట్ వాచ్ మెన్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని గాంధారి మండల విద్యాశాఖ అధికారి శ్రీహరి అన్నారు. ప్రభుత్వం అందించిన ఐఎఫ్‌బీలతో విద్యార్థులకు డిజిటల్ పాఠాలు అందుతున్నాయి. వాటి ద్వారా వాళ్లు చక్కగా అర్థం చేసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రతి పాఠశాలకు నైట్ వాచ్ మన్‌ను నియమిస్తే మంచింది


Similar News