ఆర్మూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

జామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో రాత్రి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Update: 2024-10-10 11:54 GMT

దిశ ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో రాత్రి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో మున్సిపల్ ఆధ్వర్యంలో.. నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య ,అయ్యప్ప శ్రీనివాస్ మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. అదే విధంగా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలోని కోటార్ మూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఏరియాలో గురడి రెడ్డి, గౌడ, దేవాంగ, గుండ్ల, మాదిగ, మాల, పూసల, తదితర అన్ని కులాల సంఘాల తరపున బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా.. ఆయా కుల సంఘాల మహిళ ప్రతినిధులు నిర్వహించారు. కోటార్ మూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో.. బతుకమ్మ ఉత్సవాలు అద్భుతంగా నిర్వహించిన కుల సంఘాలకు బహుమతులను గ్రామ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు అందజేశారు. కోటార్ మూర్ ఏరియా లోని కుల సంఘాల మహిళా ప్రతినిధులు బతుకమ్మలను ఊరేగిస్తూ... బతుకమ్మ పాటలు పాడుతూ సందడిగా నృత్యాలు చేశారు. అనంతరం గ్రామ శివారులో చిన్న చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేసి..చల్లంగా చూడు మమ్మల్ని తల్లి అంటూ వేడుకొని.. మళ్లీ వచ్చే ఏడాది తిరిగి రమ్మంటూ ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. మహిళలు ఏర్పాటు చేసుకున్న సద్దులను ఆరగించారు.


Similar News