ఆయుధ పూజకు గొర్రెని ఇవ్వకపోతే, మందను డీసీఎంలో ఎక్కిస్తాం

వతన్ ప్రకారం ప్రతి దసరాకు గొర్రెను ఇవ్వాలి. రైల్వే లేకుంటే ట్రాక్‌పైకి వచ్చే గొర్ల మందను డీసీఎం వ్యాన్ లో ఎక్కిస్తామని గొర్ల కాపర్లపై కొందరు రైల్వే సిబ్బంది విరుచుకుపడుతూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

Update: 2024-10-11 05:29 GMT

దిశ, భిక్కనూరు: వతన్ ప్రకారం ప్రతి దసరాకు గొర్రెను ఇవ్వాలి. రైల్వే లేకుంటే ట్రాక్‌పైకి వచ్చే గొర్ల మందను డీసీఎం వ్యాన్ లో ఎక్కిస్తామని గొర్ల కాపర్లపై కొందరు రైల్వే సిబ్బంది విరుచుకుపడుతూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ సంఘటన భిక్కనూరు మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆయుధ పూజకు గొర్రె నిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని, లేదంటే మా రూల్స్ ప్రకారం మేము నడుచుకుంటామంటూ రైల్వే సిబ్బంది కొందరు గొర్రెల కాపర్లు అరగంట పాటు వాదనకు దిగారు. ప్రతి సంవత్సరం ఆయుధ పూజకు గొర్రె ఇవ్వాల్సింది పోయి, ఇప్పుడు అండర్ పాస్ అయిందని, మా గొర్రెలు ట్రాక్ పైకి రావడం లేదని చేతులెత్తేస్తారా అంటూ వాదనకు దిగారు. గత సంవత్సరం మాదిరిగా జీవాలు ఎక్కువగా లేవని గొర్రె ఇవ్వడం మాతో సాధ్యం కాదని కాపర్లు స్పష్టం చేశారు.

దీంతో రెచ్చిపోయిన రైల్వే సిబ్బంది, ఇవ్వకపోతే మేమేంటో చూపిస్తామని, మా రూల్స్ మాకు ఉంటాయని రైల్వే ట్రాక్ వైపు వచ్చిన గొర్రెలు, మేకలను డీసీఎంలో ఎక్కించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఇస్తే ఒకరు రూల్, ఇవ్వకపోతే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మీరే చూస్తారని రైల్వే సిబ్బంది నోరు జారారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న గొర్ల కాపర్ల సంఘం సభ్యులు, మర్యాదగా అడగాల్సింది పోయి, అమర్యాదగా ప్రవర్తిస్తారా అని మండిపడ్డారు. గొర్రెను ఇవ్వలేమని నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటూ కాపర్లు తేల్చి చెప్పారు. గొర్ల మందను డీసీఎం వ్యాన్‌లో ఎక్కించినప్పుడే మాట్లాడతామని, ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లి మీపై కంప్లైంట్ చేస్తామని గొర్రెల కాపర్లు ఎదురు తిరిగారు. మాపై ఎటువంటి ఫిర్యాదులు చేసిన లెక్క చేయమని, ఏం చేసుకుంటారో చేసుకోవాలని రైల్వే సిబ్బంది సమాధానం ఇచ్చారు. చివరకు గొర్రెల కాపర్లు దిగొచ్చి గొర్రె నివ్వడంతో కథ సుఖాంతమైంది.


Similar News