ఊరికి చెరువు ఉంది.. కానీ దానికి దారి లేదు..

అంగట్లో అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్నట్టుంది ఆ ఊరి పరిస్థితి.. ఒక్కొక్క ఊర్లో చెరువులు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు.

Update: 2024-09-28 12:49 GMT

దిశ, గాంధారి : అంగట్లో అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్నట్టుంది ఆ ఊరి పరిస్థితి.. ఒక్కొక్క ఊర్లో చెరువులు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ చెరువు ఉండి కూడా చెరువుకు దారి లేకపోవడం విడ్డూరంగా మారింది. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని నాగులూర్ గ్రామపంచాయతీ ఊరి చెరువుకు దారి లేకపోవడం విడ్డూరంగా ఉంది. దాదాపు 14 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఊరిలో ఉన్న ఒక్కగానొక్క చెరువుకు దారి లేక అటు బతుకమ్మలు ఎక్కడ నిమజ్జనం చేయాలో తెలియని అయోమయ స్థితిలో గ్రామ ప్రజానీకం ఉన్నారు. గ్రామస్తులు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇంతకు ముందు ఉపాధి హామీ పనులు జరిగాయని, చెరువులో పూడిక పనులు కూడా జరిగాయని అప్పుడు నడిచేందుకు దారి ఉండేదన్నారు.

కానీ ఇప్పుడు దారి లేకుండా చేయడం ఎందుకనేది ఎవరికి అంతు చిక్కకుండా ఉందని రైతులు తమ గోడును వ్యక్తం చేస్తున్నారు. దాదాపు పట్టా బుక్కులు ఉండి చెరువు పక్కకు వెళ్లాలంటే వేరే వాళ్ళ వ్యవసాయ భూమి నుంచి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని రైతులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నీటి ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఊర చెరువు మిషన్ కాకతీయ మూడో విడత పనులు కూడా జరిగాయని అప్పుడు గుత్తేదారు ముకుందరావు పూర్తి పనులు జరిపించాలని గ్రామస్తులు తెలిపారు. చెరువు ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అట్లాంటి చెరువు ఉండి కూడా ఉపయోగించుకోలేని దుర్భర పరిస్థితిలో ఉన్నామన్నారు. చెరువు కట్ట పై కూర్చుని బతుకమ్మ నిమజ్జనం చేసి ఎంతో ఆహ్లాదకరంగా అందరూ కూర్చొని తింటూ ఉండే మధుర క్షణాలను కోల్పోయామని గ్రామస్తులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయితే చెరువు పక్కకు ఆనుకొని ఉన్న రైతులు నడవడానికి దారి లేకుండా ఆ దారిని మర్చిపోయారా, నడవలేని స్థితిలో ఇప్పుడు ఉందని గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంతకుముందు చెరువుకు దారుండేది ఇరిగేషన్, జీపీ అధికారులు..

ఇంతకు ముందు నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ అధికారులు, గ్రామపంచాయతీ సెక్రెటరీ తెలిపిన వివరాల ప్రకారం చెరువులో ఉపాధి హామీ పనులు, మిషన్ భగీరథ పనులు కూడా చేశారని అన్నారు. ఇప్పుడు అక్కడ నడవడానికి పూర్తిగా చెట్లు పొదల ఉండడంతో అటువైపు నడిచే నాధుడు కరువయ్యాడని, వాస్తవానికి దారి ఉందని అధికారులు తెలిపారు. చెరువు పక్కన ఉన్న పట్టా భూమి రైతులు దారులు వేరే దారి నుండి నడవడంతో ఈ దారి పూర్తిగా చెట్లు మొలకెత్తినట్టు అధికారులు తెలిపారు. అంతేకాకుండా నడవడానికి వీలు లేకుండా చెరులోకి దారి లేకపోవడంతో బతుకమ్మలను గణనాథులను ఊరి బయట తూముకుంటలో నిమజ్జనం చేస్తున్నామని అధికారులు తెలిపారు.


Similar News