హైకోర్టు ఉత్తర్వులు తక్షణమే అమలు చేయాలి

తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014లో నియామకం పొందిన అధ్యాపకులకు పదోన్నతులు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలిచ్చింది.

Update: 2024-10-17 10:58 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014లో నియామకం పొందిన అధ్యాపకులకు పదోన్నతులు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలిచ్చింది. కాగా కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా పదోన్నతులు కల్పించాలని విశ్వవిద్యాలయ పరిపాలన భవనం ముందు తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ. పున్నయ్య ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా.. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ పున్నయ్య విశ్వవిద్యాలయ అధికారులను డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి జరిపిన ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ కోశాధికారి డాక్టర్ ఏ. నాగరాజు మాట్లాడుతూ.. గతంలో ఈసీ నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించినారని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నివేదిక అందడంతో ప్రక్రియను త్వరితగతిన ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

ఐదు నెలల క్రితం పదోన్నతులు కల్పించాలని అడ్వకేట్ జనరల్ విశ్వవిద్యాలయానికి తన నివేదిక ద్వారా తెలిసినప్పటికీ పదోన్నతులు కల్పించడం లేదన్నారు. అడ్వకేట్ జనరల్ నివేదికను అమలుపరచాలని పలుమార్లు డిమాండ్ చేసినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దాని వల్ల పలువురు అధ్యాపకులు రాష్ట్ర హైకోర్టు ను సంప్రదించారని, ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు ఇంటెరిమ్ డైరెక్షన్ ఇస్తూ పదోన్నతులను కల్పించాలని విశ్వవిద్యాలయానికి ఉత్తర్వులను జారీ చేసిందని గుర్తు చేశారు. విశ్వవిద్యాలయ అధికారులు పదోన్నతుల ప్రక్రియను రెండు వారాల్లో పూర్తి చేయాలని, లేని పక్షంలో కోర్టు ధిక్కరణ నేరం కింద రిజిస్ట్రార్ ను వ్యక్తిగతంగా కోర్టుకు సెప్టెంబర్ 20న హాజరుకు కావాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. ప్రక్రియ ప్రారంభం కాకపోవడం వల్ల ఈనెల 20వ తేదీన కోర్టుకు హాజరైన రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు అందిన వెంటనే ప్రక్రియను మొదలు పెడతానని కోర్టులో చెప్పినప్పటికీ నేటికీ ప్రక్రియ ప్రారంభించకపోవడం శోచనీయమని వారు పేర్కొన్నారు.

పదేళ్ల నుంచి అధ్యాపకులందరు తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఉన్నారని డాక్టర్ పున్నయ్య అన్నారు. అధికారులు కాలయాపన చేయకుండా ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని గౌరవించాలేని, రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను వెంటనే అమలులోకి తీసుకు వచ్చి పదోన్నతులు కల్పించాలని పున్నయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మానించింది. తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అభిప్రాయం మేరకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను అమలు పరచడంలో విశ్వవిద్యాలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నందున ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రజాస్వామ్యబద్ధంగా విశ్వవిద్యాలయంలో నిరసన తెలియజేస్తున్నామని అన్నారు. అనంతరం రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరికి పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, డాక్టర్ మావురపు సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ రాజేశ్వరి, కార్యదర్శులు డాక్టర్ బాలకిషన్ , డాక్టర్ నీలిమా, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, డాక్టర్ జమీల్ అహ్మద్, డాక్టర్ ప్రసన్న శీల, డాక్టర్ వాసం చంద్రశేఖర్ డాక్టర్ స్వప్న, డాక్టర్ స్రవంతి, డాక్టర్ మహేందర్, డాక్టర్ రమణాచారి, డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ సమత తదితరులు పాల్గొన్నారు.


Similar News