డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.. మంత్రి జూపల్లి కృష్ణారావు

డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Update: 2024-09-30 09:39 GMT

దిశ, బాల్కొండ : డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్, భీంగల్ మండలాల్లో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ శాఖ భవనాలను మంత్రి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి, ఆల్ఫా జోలం అన్నమాట వినపడకుండా ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయమన్నారు. ఆ దిశగా రాష్ట్రంలో పూర్తి తరహాలో గంజాయిని డ్రగ్స్ ను నిర్మూలించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలోని రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ ను పోషించిందన్నారు. గతంలో డ్రగ్స్ గంజాయి కేసులు 10 ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 35 కేసులు పెరిగినట్లు ఉదాహరణగా చెప్పారు.

ఇలా ఉండటంతోనే యువత పక్కదారి పట్టి ఉపాదులను కోల్పోయారన్నారు. ముఖ్యంగా కల్లులో ఆల్ఫా సోలోమన్ డ్రగ్స్ ను వినియోగించడం నిషేధం అన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమని ఎవరికి మినహాయింపు లేదన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణ పై స్పందిస్తూ చట్టం తన పని తాను చేసుకోపోతుందని అన్నారు. ఎక్సైజ్ శాఖ ఇప్పటికి విధినిర్వాహణలో గంజాయి డ్రగ్స్ ల పై దాడులను తీవ్రతరం చేసి చేసిందన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు చైర్మన్లు కలిసి మంత్రిని ఘనంగా పూలమాలలతో, బొకేలతో, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట్ అన్వేష్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహీరబిన్ హందాన్ , ఎక్సైజ్ శాఖ అధికారులు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.


Similar News