కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలి
ఆశా వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
దిశ, కామారెడ్డి : ఆశా వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ లో అందజేశారు.