కనిపించడం లేదు ఆచూకీ తెలిస్తే చెప్పండి..

ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామంలో ఓ యువతి అదృశ్యమైంది. దీంతో ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Update: 2024-12-04 15:50 GMT

దిశా ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామంలో ఓ యువతి అదృశ్యమైంది. దీంతో ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం..ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన బైరం ప్రేమ పెద్ద కూతురు అయిన బైరం వందన( 23 ) గత మూడు సంవత్సరాల నుంచి కామారెడ్డిలో శిశురక్ష చిన్న పిల్లల దవాఖానాలో పని చేస్తుంది. వందనకి గత రెండు నెలల క్రితం నాగిరెడ్డి పేట్ మండలం రామక్కపల్లి గ్రామానికి చెందిన వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. సోమవారం నాడు సాయంత్రం 5.00 గంటలకు వందన పెళ్లి షాపింగ్ కోసం, అక్కడి నుండే డ్యూటీకి వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్ళింది. మంగళవారం కుటుంబ సభ్యులు పెళ్లి పనుల కోసం కామారెడ్డికి వెళ్ళారు. అక్కడే హాస్పిటల్లో పనిచేస్తున్న వందనను కలుద్దామని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్ళగా..వందన ఇక్కడికి రాలేదని సిబ్బంది తెలిపారు. కుటుంబ సభ్యులు వెంటనే, వందనకు ఫోన్ చేయక స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో చుట్టుపక్కల, బంధువుల దగ్గర వెతికిన అచూకీ లభించలేదన్నారు. దీంతో వందన కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎల్లారెడ్డి, ఎస్సై మహేష్ తెలిపారు


Similar News