రోడ్లపై చెత్త పేరుకుపోవడంతో కలెక్టర్ ఆగ్రహం

కామారెడ్డి - సిరిసిల్ల ప్రధాన రహదారిపై మాచారెడ్డి, లక్ష్మీ రావులపల్లి తదితర గ్రామాల మెయిన్ రోడ్లుపై చెత్త పేరుకుపోయిన దృశ్యాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గమనించారు.

Update: 2024-12-04 12:59 GMT

దిశ, మాచారెడ్డి: కామారెడ్డి - సిరిసిల్ల ప్రధాన రహదారిపై మాచారెడ్డి, లక్ష్మీ రావులపల్లి తదితర గ్రామాల మెయిన్ రోడ్లుపై చెత్త పేరుకుపోయిన దృశ్యాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గమనించారు. వెంటనే ఆయన వాహనం నిలిపివేసి ఆ ప్రాంతాలను పరిశీలించారు. జిల్లాలో పారిశుధ్య కార్యక్రమాలు సజావుగా జరుపాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు ను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పారిశుధ్య కార్యక్రమాలని ప్రతీ రోజూ నిర్వహించాలని, రోడ్లపై చెత్త కనబడకూడదని సూచించారు. అనంతరం ఆయన మాచారెడ్డి ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో శిధిలావస్థలో ఉన్న రేకుల కార్యాలయాలను పరిశీలించారు. వాటి స్థానంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మించడానికి పరిశీలన చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ గోపి బాబు, పంచాయతీ కార్యదర్శి, తదితరులు ఉన్నారు.


Similar News