పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

అకాల వర్షాలు, వడగండ్ల వానతో దెబ్బతిని పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ భరోసానిచ్చారు.

Update: 2024-03-17 13:04 GMT

దిశ, కామారెడ్డి : అకాల వర్షాలు, వడగండ్ల వానతో దెబ్బతిని పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ భరోసానిచ్చారు. ఆదివారం కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ మండలం గొట్టిముక్కుల, భిక్నూర్ మండలం లక్ష్మి దేవునిపల్లి, అంతంపల్లి, రామేశ్వర్ పల్లి, జంగంపల్లి, రాజంపేట మండలం తలమడ్ల, ఆరేపల్లి, పెద్దయిపల్లి, రాజంపేట, కామారెడ్డి మండలం పాత రాజంపేట, నరసన్న పల్లి, గ్రామంలో వడగళ్ల వానతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా నష్ట పోయిన రైతులకు భరోసా కల్పించారు. ఆయన మాట్లాడుతూ...రైతులు పండించిన వరి, మొక్కజొన్న, పసుపు, మిర్చి, మామిడి

     తదితర పంటలు నేల పాలైనట్టు తెలిపారు. రైతులు అధైర్య పడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పంట నష్టపోయిన ప్రాంతాల్లోకి అధికారులను పంపించి నష్టపోయిన పంటల నివేదికలు తెప్పించుకొని రైతులందరికీ న్యాయం చేస్తామన్నారు. ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చూసుకుంటామన్నారు. తెలంగాణ వచ్చాక గత ప్రభుత్వం రైతులకు ఎలాంటి పంట నష్టం అందించలేదన్నారు. పంట నష్టం అంచనా వేసి ప్రతి ఎకరాకు నష్ట పరిహారం అందించేలా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి కాంగ్రెస్ నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటించి అధికారులతో కలిసి పంట నష్టం పై నివేదికలు అందించాలని సూచించారు. రైతులకు మనో ధైర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కైలాస్ శ్రీనివాసరావు, భీమ్ రెడ్డి, గాల్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తిరుమల గౌడ్, చంద్రకాంత్ రెడ్డి, కుంట లింగారెడ్డి, యాదవ రెడ్డి, కృష్ణారావు, అంకం రాజు, గూడెం శ్రీనివాస్ రెడ్డి, గణేష్ నాయక్, సుతారి రమేష్, నౌసినాయక్, అనంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Similar News