ఉపాధ్యాయులు ఎపిక్ నంబర్లు అందించాలి

రాబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా డేటా బేస్ రూపొందించుటకు ఉపాధ్యాయులు ఎపిక్ నంబర్లను అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు.

Update: 2024-02-27 14:26 GMT

దిశ, కామారెడ్డి : రాబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా డేటా బేస్ రూపొందించుటకు ఉపాధ్యాయులు ఎపిక్ నంబర్లను అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. మంగళవారం డీఈఓ, ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో నిర్వహించిన జూమ్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ... ఓటరు ఐడీ ఎపిక్ నంబర్ ఇవ్వడంవల్ల ఎన్ని బ్యాలెట్ పేపర్లు ముద్రించాలో లెక్కించడంతో పాటు పోస్టల్ బ్యాలెట్ పేపర్ లను పంపుటకు వీలుంటుందన్నారు. పాఠశాలలో ముందస్తు అనుమతి లేకుండా ఉపాధ్యాయులు గైర్హాజరవుతున్నారని

     తమ దృష్టికి వచ్చిందని, ఇక నుండి పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసేందుకు మండల వారీగా సీనియర్ అధికారులను నియమిస్తున్నామని అన్నారు. సెలవులు అవసరమైతే ముందస్తు అనుమతి తీసుకొని వెళ్లాలని, సీనియర్ అధికారుల ఆకస్మిక తనిఖీలో ఉపాధ్యాయులు గైర్హాజరు ఉన్నట్లు గుర్తిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్చి 18 నుండి జరిగే పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని, సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఇందుకు నియమించిన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్ మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లు పరీక్షల నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ జూమ్ సమావేశంలో డీఈఓ రాజు, ఎంఈఓ లు, కాంప్లెక్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.


Similar News