సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన విద్యార్థులు

సేంద్రియ వ్యవసాయంతో 110 రకాలకు పైగా దేశీ వరి విత్తనాలను పండిస్తున్న జక్రాన్ పల్లిమండలం చింతలూరు గ్రామానికి చెందిన ఆదర్శ రైతు చిన్నికృష్ణుడి వ్యవసాయ క్షేత్రాన్ని, సోమవారం కేంద్రీయవిద్యాలయానికి చెందిన విద్యార్థులు సందర్శించారు.

Update: 2022-12-05 13:01 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: సేంద్రియ వ్యవసాయంతో 110 రకాలకు పైగా దేశీ వరి విత్తనాలను పండిస్తున్న జక్రాన్ పల్లిమండలం చింతలూరు గ్రామానికి చెందిన ఆదర్శ రైతు చిన్నికృష్ణుడి వ్యవసాయ క్షేత్రాన్ని, సోమవారం కేంద్రీయవిద్యాలయానికి చెందిన విద్యార్థులు సందర్శించారు. రైతు చిన్నికృష్ణుడు గత 13 సంవత్సరాలుగా సేంద్రీయ సాగు పద్ధతులద్వారా తాను చేస్తున్న సాగు విధానాన్ని కేంద్రీయ విద్యార్థులకు వివరించి, దానివల్ల కలిగే లాభాలను తెలిపారు. ఈసందర్భంగా కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మన ప్రాంతానికి చెందిన రైతు ప్రపంచ స్థాయిలోగుర్తింపు వచ్చేలా వ్యవసాయం చేయడం జిల్లాకే గర్వకారణం అన్నారు. ఇటీవల రైతుకు లభించిన అవార్డుల పట్ల సంతోషంవ్యక్తం చేస్తూ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నారాయణ, కేంద్రీయ విద్యాలయ అధ్యాపకులు అభిలాష్, శ్రీప్రియ, సృజన, రాంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News