ట్యాక్స్ వసూళ్ల పై ఫోకస్.. వందశాతం వసూళ్లే లక్ష్యం !

అభివృద్ధి పరుగులు పెట్టాలంటే పన్ను చెల్లించాల్సిందే. పట్టణాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు ఆస్తిపన్ను కీలకంగా మారింది.

Update: 2025-03-18 05:29 GMT
ట్యాక్స్ వసూళ్ల పై ఫోకస్.. వందశాతం వసూళ్లే లక్ష్యం !
  • whatsapp icon

అభివృద్ధి పరుగులు పెట్టాలంటే పన్ను చెల్లించాల్సిందే. పట్టణాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు ఆస్తిపన్ను కీలకంగా మారింది. ఇందు కోసం ఉమ్మడి జిల్లాలో అధికారులు మున్సిపాల్టీలలో ఆస్తిపన్ను వసూళ్లు పూర్తిస్థాయిలో చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్నులు, ట్రేడ్‌ లైసెన్స్‌లు, ఇతర పన్నుల వసూళ్లకు మరో 14 రోజులు మాత్రమే మిగిలింది. ఈ ఆర్థిక సంవత్సరం 31వ తేదీలోగా వందశాతం పన్నుల వసూలు పూర్తి చేసి ముందు వరుసలో నిలవడానికి జిల్లాలోని మున్సిపల్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కాగా ఆస్తి పన్ను వసూళ్లలో ఆర్మూరు బల్దియా దూసుకెళ్తున్నట్టు సమాచారం. ఈ మున్సిపల్ లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6 కోట్ల 50 లక్షల పన్నుల డిమాండ్ కాగా ఇప్పటి వరకు రూ. 4 కోట్ల 12 లక్షల ఇంటి ఇంటి పన్నులు తదితర టాక్స్ లు వసూళ్లు చేశారు. ఇప్పటి వరకు ఈ మున్సిపాల్టీలో 64% ఇంటి పన్నులను వసూలు చేశారు.

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ తో పాటు నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, భీంగల్ మున్సిపాలిటీలో ఈనెల మార్చి 31వ తేదీ వరకు మున్సిపల్ పన్ను 100% వసూళ్లే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పేద మధ్యతరగతి వర్గాల పై భవిష్యత్తులో ఆర్థిక భారం పడకుండా అక్రమ లేఔట్ లోని ప్లాట్ల క్రమబద్ధీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ పనిని సైతం ఈ నెలాఖరులోనే పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో మున్సిపల్ అధికారికగణం పన్నుల వసూళ్లతో పాటు ఎల్ఆర్ఎస్ లో ప్లాట్ ల క్రమబద్ధీకరణ పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఉన్నతాధికారుల మోటివేషన్ నిరంతర సమీక్షలతో మున్సిపల్ అధికారులు 100% మున్సిపల్ పన్నుల వసూళ్లే లక్ష్యంగా, గతంలో 2020 సంవత్సరంలో ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకున్న వారి నుంచి క్రమబద్ధీకరణ చార్జీలను వసూలు చేయడమే లక్ష్యంగా మున్సిపల్ అధికారులు నిరంతరంగా శ్రమిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో రూ.6 కోట్ల 50 లక్షల పన్నుల డిమాండ్ కాగా ఇప్పటివరకు మున్సిపల్ కమిషనర్, ఆర్వో అధికారులు అనునిత్యం పర్యవేక్షణ చేస్తూ, తరచూ సమీక్షలతో 4 కోట్ల 12 లక్షల ఇంటి ఇంటి పన్నులు తదితర టాక్స్ లు వసూలు అయ్యాయి. కాగా ఇంకా మిగతా రెండు కోట్ల 37 లక్షల పన్నులు వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 63. 44% ఇంటి పనులను ఆర్మూర్ మున్సిపల్ లో ఇంటి పనులను మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల అధికారులు, బిల్ కలెక్టర్లు వసూలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులే లక్ష్యంగా ఈ నెలాఖరి వరకు 100% మున్సిపల్ ఇంటి పనులను వసూలు చేయడమే లక్ష్యంగా మున్సిపల్ అధికారిక గణం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అక్రమ లేఅవుట్లు ప్లాట్ల క్రమబద్ధీకరణకై అడుగులు..

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో 2020 సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ కింద అక్రమ లే అవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు మున్సిపల్ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. 2020 సంవత్సరంలో ఆర్మూర్ మున్సిపాలిటీలో 4125 మంది నుంచి ప్లాట్ల క్రమబద్ధీకరణకు అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ప్రస్తుతం వీటిలోంచి ఇప్పటి వరకు 3065 మందికి ప్లాట్ల క్రమబద్దీకరణ కై ఫీజులు చెల్లించారని సమాచారం అందించారు. ఇప్పటి వరకు 210 మంది దరఖాస్తుదారుల నుంచి కోటి రూపాయలను వారి ప్లాట్ క్రమబద్ధీకరణ కై ఫీజులను వసూలు చేశారు. ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్ మేళాలను పెట్టడంతో పాటు, ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా మామిడిపల్లి చౌరస్తా, పెర్కిట్ - కోటార్ మూర్ చౌరస్తాలలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేయించడంతో పాటు ప్లాట్ల దరఖాస్తుల దారులకు ప్రతినిత్యం ఫోన్లు చేస్తూ ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు.

పన్ను వసూళ్లలో ఆర్మూర్ దూకుడు

ఆస్తి పన్ను వసూళ్లలో ఆర్మూరు బల్దియా దూసుకెళ్తున్నది. 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి గాను శత శాతం పన్నుల వసూళ్లే లక్ష్యంగా పురపాలక అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే 64.శాతం పన్ను వసూళ్లు సాధించి జిల్లాలో ముందంజలో నిలిచింది.

100% పన్నులు వసూలు చేస్తాం.. రాజు, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఇప్పటి వరకు 64 శాతం పై చిలుకు ఇంటి పన్ను, ఇతర పనులు వసూలు అయ్యాయి. ఇంకా మిగిలి ఉన్న పనులను ఈ నెలాఖరు వరకు బిల్ కలెక్టర్లు వార్డ్ ఆఫీసర్లతో నిరంతర పర్యవేక్షణ, సమీక్షలు చేస్తూ 100% తప్పకుండా పూర్తి చేయిస్తాం. ఇప్పటి వరకు ఆర్మూర్ మున్సిపల్ లో ప్లాట్ల క్రమబద్ధీకరణకు కోటి రూపాయల వరకు నిధులు జమయ్యాయి. మెజారిటీ ప్లాట్ లను క్రమబద్ధీకరణ చేయించి 10 కోట్ల రూపాయల వసూలు చేయడంతో పాటు సామాన్య ప్రజల అక్రమ లే అవుట్ల ఇబ్బందులు భవిష్యత్తులో ఉండకుండా ప్లాట్లను క్రమబద్ధీకరణ చేయించుకోవాలని ప్రజలకు ముందుగా అవగాహన కల్పిస్తున్నాం. ప్లాట్ల క్రమబద్ధీకరణ వల్ల భవిష్యత్తులో పర్మిషన్లకు, ఇంటి నిర్మాణాల సమయంలో అక్రమ లే అవుట్ల ఇబ్బందులు ఉండవు.


Similar News