9 మందికి జైలు.. 33 మందికి జరిమానా .. అసలు విషయం ఇదే!
మద్యం సేవించి వాహనాలు నడిపిన నిందితులకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో శిక్షలు పడ్డాయి. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిల్లో డ్రంక్ అండ్ డ్రై

దిశ ప్రతినిధి, నిజామాబాద్ మార్చి 18: మద్యం సేవించి వాహనాలు నడిపిన నిందితులకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో శిక్షలు పడ్డాయి. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించారు. మద్యం సేవించి పోలీసులకు పట్టుబడిన 42 నిందితులకు మంగళవారం సంబంధిత పోలీస్ స్టేషన్లలో అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి, వారిని ఉదయం కోర్టులో స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో జడ్జి నూర్జహాన్ బేగం ఎదుట హాజరు పరిచారు. వీరిలో 9 మందికి జైలు శిక్ష, 33 మందికి జరిమాన విధించారు.
జైలుశిక్ష పడిన వారిలో కొందరికి ఒక రోజు, మరి కొందరికి రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించారు. నగరంలోని ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిందితుడు షేక్ షఫీయోద్దిన్ కు రెండు రోజుల జైలు శిక్ష ఖరారైంది. టూటౌన్ పి.యస్ పరిధిలోని నాగారం కు చెందిన జే. రాజ్ రతన్ కు ఒక రోజు జైలు శిక్ష, త్రీ టౌన్ పీఎస్ పరిధిలోని ఎల్లమ్మ గుట్టకు చెందిన వాసి రెడ్డి రేవంత్ కు రెండు రోజుల జైలు శిక్ష, త్రీ టౌన్ పరిధిలోని దుబ్బాకు చెందిన షిండే కు 2 రోజుల జైలు శిక్ష, వన్ టౌన్ పరిధిలోని రఘునాథ్ పూర్ కు చెందిన మోరేలాల్ కు ఒక్క రోజు జైలు శిక్ష, వన్ టౌన్ పి.యస్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన మాగంటి కేశవ్ కు రెండు రోజుల జైలు శిక్ష, నవీపేట్ పి.యస్ పరిధిలోని సీహెచ్ కొండూర్ కు చెందిన ఉట్నూర్ గంగాధర్ కు రెండు రోజుల జైలు శిక్ష, నిజామాబాద్ రూరల్ పి.యస్ పరిధిలోని బోర్గాం కు చెందిన మహ్మద్ అజార్ కు ఒక్క రోజు జైలు శిక్ష,నిజామాబాద్ రూరల్ పి.యస్ పరిధిలోని గురువాయ పాలెం కు కనుగుడ్డి అశోక్ రెడ్డికి జడ్జి రెండు రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ.. జడ్జి తీర్పను వెలువరించారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, వాహన దారులు తమ వాహనాలకు సంబంధించిన పత్రాలను సక్రమంగా ఉంచుకోవాలని నిజామాబాద్ ఏసీపీ ఎల్.రాజా వెంకట్ రెడ్డి తెలిపారు.