మోకాలు అరుగుదలకు అత్యాధునిక రోబోటిక్ చికిత్స

మోకాళ్ళ చికిత్స కు సోమాజిగూడ యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో మోకాళ్ళ మార్పు కోసం రోబోటిక్ చికిత్స ద్వారా దీర్ఘకాలికంగా మోకాళ్ల నొప్పుతో బాధపడుతున్న వారికి శాశ్వతంగా ఉపశమనం పొందేలా చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి సీనియర్ ఆర్థోపెడిక్ వైద్యులు సునీల్ తెలిపారు.

Update: 2024-03-18 10:21 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : మోకాళ్ళ చికిత్స కు సోమాజిగూడ యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో మోకాళ్ళ మార్పు కోసం రోబోటిక్ చికిత్స ద్వారా దీర్ఘకాలికంగా మోకాళ్ల నొప్పుతో బాధపడుతున్న వారికి శాశ్వతంగా ఉపశమనం పొందేలా చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి సీనియర్ ఆర్థోపెడిక్ వైద్యులు సునీల్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హోటల్లో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోకాళ్ళ అరుగుదల, నొప్పులకై సరైన సమయంలో నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకుంటే భవిష్యత్తులో సాఫీగా నడిచేందుకు కష్టతరం కాదని ఆయన తెలిపారు.

చాలామంది శస్త్రచికిత్స ఎందుకని తాత్కాలిక ఉపశమనం కోసం పెయిన్ రిలీఫ్ కోసం ఇంజక్షన్లు వాడుతున్నారని దీనివల్ల ప్రజలు మోసపోవద్దని ఆయన వెల్లడించారు. యశోద హాస్పిటల్ లో అత్యాధునిక రోబోటిక్ వైద్య చికిత్సతో నయం చేస్తున్నామని ఆయన తెలిపారు. సామాన్యులకు అందుబాటులో ఫీజులో సబ్సిడీ ఇస్తూ ఈ వైద్యం అందిస్తున్నామని అన్నారు. సమావేశంలో ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

మోకాళ్ళ అరుగుదల నొప్పులతో బాధపడుతున్న వారు ఈ చికిత్సను చేయించుకోవాలని సూచించారు. ఇటివల యశోద హాస్పిటల్ లో మోకాళ్ళ చిప్ప శస్త్ర చికిత్స చేయించుకున్న గంగాధర్ అనే వ్యక్తి మాట్లాడుతూ తాను సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో ఇటీవల మోకాళ్ళ చికిత్స చేయించుకున్నానని, చేయించుకునే ముందు ఈ చికిత్స ద్వారా భవిష్యత్తులో తనకు ఇబ్బంది ఏర్పడుతుందని, భయపడ్డాను అని కానీ చికిత్స చేసుకున్న అనంతరం కేవలం మూడు రోజులకే తాను యథావిధిగా నడవగలిగానని ఆయన చెప్పారు.


Similar News