సిద్దుల గుట్టపై ప్రత్యేక పూజలు

ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దుల గుట్టపై సోమవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది.

Update: 2024-12-16 13:31 GMT

దిశ,ఆలూర్ : ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దుల గుట్టపై సోమవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. హనుమాన్, దుర్గామాత ఆలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు శివాలయంలో,అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. చాలామంది భక్తులు మెట్ల మార్గం ద్వారా, కాలి నడకన వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారికి నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో..అశేష భక్తజన సమక్షంలో పల్లకి సేవ, భజన కార్యక్రమాలు, నృత్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ..భక్తుల సౌకర్యార్థం కాటేజ్ రూంలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భారత్ గ్యాస్ సుమన్, పీ సీ గంగారెడ్డి, కొడిగెల మల్లయ్య, ప్రశాంత్ గౌడ్, జిమ్మీ సంధ్యా రవి, కొంతం మంజుల మురళి,పూజారిసతీష్ , ప్రొద్దుటూరి చరణ్ రెడ్డి, అలిశెట్టి నరేష్, బోండ్ల ఆనంద్, సిద్దులు గుట్ట సేవ సమతి, భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Similar News