కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య
గాంధారి మండలంలోని రాంపూర్ గడ్డ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
దిశ, గాంధారి : గాంధారి మండలంలోని రాంపూర్ గడ్డ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గాంధారి ఎస్ఐ గణేష్ తెలిపిన వివరాలు ప్రకారం..సంపంగి పోచయ్య అనే వ్యక్తి కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సంపంగి పోచయ్య గత కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఆదివారం నాడు సాయంత్రం తీవ్రమైన నొప్పి రావడంతో..జీవితంపై విరక్తి చెంది గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ రాత్రి మరణించాడు. మృతుడి భార్య సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.