భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

భార్య కాపురానికి రావడం లేదని తీవ్ర మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన దోమకొండ మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది.

Update: 2024-12-16 12:42 GMT

దిశ ,దోమకొండ : భార్య కాపురానికి రావడం లేదని తీవ్ర మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన దోమకొండ మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..మండల కేంద్రానికి చెందిన బోయిన రాకేష్(26) డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత ఆరు నెలలుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయి, కాపురం చేసేందుకు రాకపోవడంతో.. తీవ్ర మనస్థాపానికి గురైన భర్త, వారి వ్యవసాయ బావి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు దోమకొండ ఎస్ఐ ఆంజనేయులు నేతృత్వంలో కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.


Similar News