దీర్ఘకాలికంగా పెండింగ్​లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి

జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ సూచించారు.

Update: 2024-02-28 11:51 GMT

దిశ, కామారెడ్డి : జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ సూచించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారి సమీక్షలో (క్రైమ్ మీటింగ్) ఆమె మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఫోక్సో యాక్ట్ కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా లో మిస్సింగ్ అయన మహిళలు, చిన్న పిల్లల కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని ట్రేస్ చేయాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అయిన గుట్కా రవాణా, గంజాయి, పేకాట, అక్రమ ఇసుక రవాణా వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, అక్రమ మార్గాల ద్వారా

     అధిక వడ్డీలతో అమాయక ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నేర స్వభావం కలిగిన వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేయాలని సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏవిధమైన చర్యలను తీసుకోవడంతో ప్రమాదాలు తగ్గుతాయో అధికారులతో చర్చించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే ప్రాంతాల పై నిఘా ఉంచాలని, వారి పై కేసు లు నమోదు చేయాలన్నారు. ఈ సందర్భంగా విధుల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని గుర్తించి వారికి జిల్లా ఎస్పీ అవార్డులు అందజేశారు.

    అవార్డులు అందుకున్న వారిలో జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అఫ్సర్, ఆఫీస్ సూపరింటెండెంట్ రవీందర్ సింగ్, జూనియర్ అసిస్టెంట్ శివ, ఏఎస్ఐ ప్రభాకర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ లు కరుణాకర్, ఏ.విశ్వనాథం, ఎం.రాజు, రాజు, హెడ్ కానిస్టేబుల్ సాయిగౌడ్, బుచ్చయ్య, గంగాధర్, అశోక్, రవికుమార్, సంజీవులు, జి.సాయన్న, మురళి, రవీందర్, సంజీవ్, గణేష్, నర్సింలు, రాములు, విక్రమ్ రెడ్డి, ఉస్మాన్, రాజేశ్వర్ లను అవార్డులతో అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె.నరసింహారెడ్డి, డీఎస్‌పీలు డి.నాగేశ్వరరావు, శ్రీనివాస్, టి.సత్యనారాయణ, మధన్ లాల్ (డి‌సి‌ఆర్‌బి), ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎం.జార్జ్, డీసీఆర్‌బీ ఇన్స్పెక్టర్ రవీందర్, సీఐలు, ఎస్ఐలు, తదితరులు పాల్గొన్నారు.


Similar News