పెరికిట్ కాంతి హై స్కూల్లో వైభవంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు..
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో గల కాంతి హై స్కూల్లో పాఠశాల 25వ వ్యవస్థాపక దినోత్సవ సంబరాలను అత్యంత వైభవంగా పాఠశాల యాజమాన్యం నిర్వహించింది.
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో గల కాంతి హై స్కూల్లో పాఠశాల 25వ వ్యవస్థాపక దినోత్సవ సంబరాలను అత్యంత వైభవంగా పాఠశాల యాజమాన్యం నిర్వహించింది. ఈ సందర్భంగా పాఠశాల ఫౌండర్ కరస్పాండెంట్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ కేవలం 30 మంది విద్యార్థులతో 1999లో ఈ పాఠశాలను ప్రారంభించామని, అప్పటి నుంచి ఇప్పటి వరకు తమపై ఎనలేని నమ్మకాన్ని ఉంచి వెన్నంటి నడిచిన తల్లిదండ్రులు, విద్యార్థులు శ్రేయోభిలాషులతో పాటు తమతో కలిసి ప్రయాణం చేసిన టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే సిల్వర్ జూబ్లీ వేడుకలలో భాగంగా రకరకాల వేడుకలను జరుపుతూ, అందులో విద్యార్థులను భాగస్వాములు చేసి వారి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ , స్టేజ్ పెర్ఫార్మెన్స్ ని పెంపొందిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఈ సంవత్సరం ఘనంగా అన్యువల్ డే వేడుకలు చేస్తామన్నారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు వీక్షకులందర్నీ ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో పెర్కిట్ మాజీ సర్పంచ్-రోటరీ పీడీజీఎన్ వి. హనుమంత్ రెడ్డి , రోటరీ పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ రూపాలి మురళి , రోటరీ సభ్యులు చరణ్ రెడ్డి , లబిశెట్టి శ్రీనివాస్, లింబాద్రి గౌడ్, రాంప్రసాద్, గడుకోల్ గంగారెడ్డి, రాజేందర్ రెడ్డి, కాంతి హై స్కూల్ డైరెక్టర్లు హిమారాణి రెడ్డి, శశాంక్ రెడ్డి, నికిత రెడ్డి, పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.