స్పెషల్ ఆఫీసర్ వద్దంటూ విద్యార్థుల ఆందోళన

కామారెడ్డి జిల్లా బీబీపేట కేజీబీవీలో పనిచేసిన స్పెషల్ ఆఫీసర్ (ఎస్ ఓ) మంగ మాకు వద్దంటూ విద్యార్థులు మండల విద్యాధికారి ముందు ఆందోళన చేశారు.

Update: 2024-11-22 13:54 GMT

దిశ, మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా బీబీపేట కేజీబీవీలో పనిచేసిన స్పెషల్ ఆఫీసర్ (ఎస్ ఓ) మంగ మాకు వద్దంటూ విద్యార్థులు మండల విద్యాధికారి ముందు ఆందోళన చేశారు. దోమకొండ కేజీబీవీలో పర్మనెంట్ బదిలీ ఆర్డర్ ఇచ్చిన విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆమె మాకు వద్దంటూ ఆందోళనకు దిగారు. బీబీపేట కేజీబీవీ నుంచి దోమకొండ కేజీబీవీ కి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ మంగ,మరో ముగ్గురు సిబ్బందితో అక్కడి విద్యార్థులు ఏ విధంగా టార్చర్ అనుభవించారో తాము కూడా అలాగే అనుభవించాలా అని ప్రశ్నించారు. స్పెషల్ ఆఫీసర్ మంగమ్మ మరో ముగ్గురు సిబ్బందిని పంపించే వరకు ఆహారం తీసుకోమని ఎంఈఓ విజయకుమార్ కు విద్యార్థులుల స్పష్టం చేశారు. డిఇఓ,జిల్లా అధికారులతో మాట్లాడి కొత్తగా వచ్చిన ఎస్ఓ, మరో ముగ్గురు సిబ్బందిని పంపిస్తానని ఎంఈఓ హామీ ఇచ్చినా విద్యార్థులు నిరసన కొనసాగించారు. దీంతో ఎంఈఓ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో..కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆర్డీవోను విచారణకు ఆదేశించారు.


Similar News