ఆర్మూర్ మున్సిపల్ మేనేజర్ సిడిఎంఏకు సరెండర్..?

ఆర్మూర్ మున్సిపల్ మేనేజర్ హయూమ్ ను సిడిఎంఏ కు సరెండర్ చేస్తూ ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.

Update: 2024-11-22 12:44 GMT

దిశ ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ మేనేజర్ హయూమ్ ను సిడిఎంఏ కు సరెండర్ చేస్తూ ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయ కమిషనర్ రాజు,మున్సిపల్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ అధికారి శేఖర్ తో, మేనేజర్ హయూమ్ కు సిడిఎంఎకు రిపోర్ట్ చేసి..సరెండర్ కావాలని ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ మేనేజర్ల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది.  ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వాగ్వాదం మున్సిపల్ కమిషనర్ రాజు పై మున్సిపల్ మేనేజర్ తీవ్రమైన పదజాలంతో అవినీతి ఆరోపణలు గట్టిగా గుప్పించారు. ఈ క్రమంలోనే ఆర్మూర్ మున్సిపల్ మేనేజర్ హయూమ్ ను సిడిఎంఏ కు సరెండర్ చేస్తూ..ఆర్మూర్ మున్సిపల్ ఎస్టాబ్లిష్మెంట్ అధికారి శేఖర్ ఆదేశాలు ఇవ్వడంతో ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో శుక్రవారం ఈ అంశం చర్చనీయాంశమైంది.

ఆర్మూర్ మున్సిపల్ మేనేజర్ హయూమ్ ను మున్సిపల్ కమిషనర్ రాజు సిడిఎంఏకు సరెండర్ చేస్తూ..ఆదేశాలు ఇచ్చిన విషయం జరుగుతుందా అనే అనుమానాలు ఆర్మూర్ లో విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ విషయం క్షణాల్లోనే ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ప్రధాన సెంటర్లలో చర్చనీయాంశంగా మారింది. ఆర్మూర్ మున్సిపల్ మేనేజర్ హయూమ్ సిడిఎంఎ కు సరెండర్ అవుతాడా అంటూ ఆర్మూర్లో అనుమానాలు జోరందుకున్నాయి. మున్సిపల్ మేనేజర్ హయుం సరెండర్ ఆపేందుకు ఆర్మూర్ మున్సిపల్ కు చెందిన మైనార్టీ కౌన్సిలర్లు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ లతో సంప్రదింపులు చేస్తూ..ఈ విషయాన్ని వారికి వివరిస్తూ మున్సిపల్ మేనేజర్ హయూమ్ సరెండర్ ను ఆపేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో త్వరలో జరగనున్న సర్వసభ్య సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అవినీతి ఆరోపణలు రుజువులతో సహా బట్టబయలు చేస్తానని బాహాటంగా ప్రకటించిన మున్సిపల్ మేనేజర్ హయూమ్ సరెండర్ నిలుస్తుందా..లేదా ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి దూరమై సిడిఎంఏ కు సరెండర్ అవుతాడా అనే చర్చ ఆర్మూర్ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది.


Similar News