ఆగని ఫోన్ శాడిస్ట్ ఆగడాలు

సెల్ ఫోన్ శాడిస్ట్ ఆగడాలు మితిమీరి పోయాయి. అసభ్యకర మెసేజ్ లు పెడుతూనే... నీ రేటు ఎంత అంటూ టెక్స్ట్ మెసేజ్ చేస్తూ బరితెగించడంతో బాధితులు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు.

Update: 2024-02-23 16:01 GMT

దిశ, భిక్కనూరు : సెల్ ఫోన్ శాడిస్ట్ ఆగడాలు మితిమీరి పోయాయి. అసభ్యకర మెసేజ్ లు పెడుతూనే... నీ రేటు ఎంత అంటూ టెక్స్ట్ మెసేజ్ చేస్తూ బరితెగించడంతో బాధితులు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. సెల్ ఫోన్ శాడిస్ట్ అనే శీర్షికన దిశ జిల్లా టాబ్లాయిడ్ లో వచ్చిన కథనానికి స్పందించిన చాలామంది మహిళలు తమ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ తో పాటు, ఫేస్ బుక్, ఇంస్ట్రాగ్రామ్ లలో పెట్టిన ఫొటోలను తీసేశారు. అంతేకాకుండా దిశ లో వచ్చిన కథనాన్ని ఇంట్రెస్ట్ గా చదివి సెల్ ఫోన్ ల తో జాగ్రత్తగా ఉండాలని చర్చించుకుంటున్నారు.

    భిక్కనూరు సర్కిల్ పరిధిలోని పోలీసులను ఆశ్రయించి బాధితులు కంప్లైంట్ చేసినప్పటికీ, గుర్తు తెలియని శాడిస్తు లు మాత్రం బూతు, అసభ్యకర, పోస్ట్ ల మీద పోస్టులు పెడుతూ టార్చర్ చేస్తుండడం మాత్రం ఆపలేకపోతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు ప్రాంతం నుంచి అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్లు చేయడం, వాట్సాప్, టెక్స్ట్ మెసేజ్ లు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారు. వారి బూతు పురాణం భరించలేక బాధితులు సెల్ ఫోన్ సిమ్ లను తీసి పడేశారు. శాడిస్టులను పట్టుకొని కఠినంగా తమకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


Similar News