మోడీని తొలగించండి... వ్యవసాయ రంగాన్ని కాపాడండి...

ఢిల్లీ రైతాంగ న్యాయమైన ఆందోళన పై కేంద్రం, హర్యానా ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో యువరైతు శుభకరన్ సింగ్ చనిపోయిన విషయం తెలిసిందే.

Update: 2024-02-22 10:37 GMT

దిశ, ఆర్మూర్ : ఢిల్లీ రైతాంగ న్యాయమైన ఆందోళన పై కేంద్రం, హర్యానా ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో యువరైతు శుభకరన్ సింగ్ చనిపోయిన విషయం తెలిసిందే. ఆయనకు జోహార్లు అర్పిస్తూ... మోడీని తొలగించి రైతుని కాపాడాలని ఆర్మూర్ లో అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆ రెండు ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రైతుల సమస్యలపై చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలిన హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల

    రైతులపై మంగళవారం పోలీసులు జరిగిన కాల్పుల్లో యువరైతు శుభ కరెన్ సింగ్ చనిపోయాడని తెలిపారు. ఇందుకు నిరసనగా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నాయకత్వంలో ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో హర్యాన, మోడీ సర్కార్ దిష్టిబొమ్మలను జిల్లా అధ్యక్షుడు సారా సురేష్ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వి.ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన సహాయ కార్యదర్శి బి. దేవరం, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కిషన్, ఏఐపీకే ఎస్ నాయకులు ఆకుల గంగారం, టి.గంగాధర్, ఇస్తారి రమేష్, సీపీఎం ప్రజా పంథా కిషన్, ప్రజా సంఘాల నాయకులు నరేందర్, అశోక్, నిఖిల్, మహేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. 


Similar News