ఆర్మూర్ వంద పడకల ఆసుపత్రికి 26 మంది నర్సింగ్ స్టాప్ నియామకం

ఆర్మూర్ పట్టణ కేంద్రంలో గల 100 పడకల ఆసుపత్రిలో 26 మంది నర్సింగ్ స్టాప్ నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-02-22 09:04 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణ కేంద్రంలో గల 100 పడకల ఆసుపత్రిలో 26 మంది నర్సింగ్ స్టాప్ నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి ఈ విషయాన్ని ఇటీవల కాంగ్రెస్ నాయకుడు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఆరోగ్య శాఖ మంత్రి 26 మంది నర్సింగ్ స్టాఫ్​ను నియమిస్తూ సంబంధిత శాఖ ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు. వైద్యులను కూడా త్వరలోనే నియమిస్తామని, 100 పడకల ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.   


Similar News