పశువుల కొవ్వుతో నూనె తయారీ

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ రెండవ రోడ్డులో ఎద్దు మాంసం తో కల్తీ నూనె తయారీ బట్టబయలైంది.

Update: 2024-02-27 14:51 GMT

దిశ, బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ రెండవ రోడ్డులో ఎద్దు మాంసం,కొవ్వుతో కల్తీ నూనె తయారీ బట్టబయలైంది. ఎద్దు మాంసంతో కల్తీ నూనె తయారుచేసి అమ్ముతున్నారని చుట్టుపక్కల ప్రజలు గమనించి నిలదీశారు. దుర్వాసనతో పాటు పొగ రావడంతో ప్రజలు ఏం చేస్తున్నారని ప్రశ్నించగా ఎద్దు మాంసం తో నూనె తయారు చేస్తున్నామని అక్కడ ఉన్న చిన్నారులు చెప్పారు. దాంతో వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ విషయమై పోలీసులు విచారణ చేపడుతున్నారు.


Similar News