పెర్కిట్ మహిళ ప్రాంగణం అధికారిణిపై విషప్రయోగం..

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల పెర్కిట్ దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో విష ప్రయోగం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-02-06 12:59 GMT

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల పెర్కిట్ దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో విష ప్రయోగం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెర్కిట్ మహిళా ప్రాంగణం జిల్లా అధికారిని పద్మ పై విష ప్రయోగం చేసేందుకు పక్కా ప్లాన్ తో అటెండర్లు సిద్ధమయ్యారు. ఇటీవల మహిళా ప్రాంగణంలోని అటెండర్ సత్యవతిని సస్పెండ్ చేయడం తో, మరో అటెండర్ అలివేలు తో కలిసి జిల్లా అధికారిని పద్మ పై విష ప్రయోగం చేసేందుకు కుట్ర అన్నారు. మహిళా ప్రాంగణం జిల్లా అధికారిని పద్మ తాగే జ్యూస్ ,అన్నంలో విషం కలిపేందుకు అటెండర్లు పన్నాగం పని అటెండర్ దగ్గర పనిచేసే వనితను ఆ విష ప్రయోగం చేసేందుకు వాడుకున్నారు.

విష ప్రయోగం చేసేందుకు వాడుకున్న వనిత ఆ విషయాన్ని ప్రక్కనగల ఇతర బోధకులతో చెప్పడంతో విష ప్రయోగ విషయం జిల్లా మహిళ ప్రాంగణం అధికారిని పద్మ కు తెలిసింది. విష ప్రయోగ విషయం తెలుసుకున్న జిల్లా ప్రాంగణం అధికారిని పద్మ ఆర్మూర్ లోని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విలేకరులకు మంగళవారం తెలిపింది. మహిళా ప్రాంగణంలో అటెండర్లుగా పనిచేసే వీరి ఇరువురు ఏళ్లుగా ప్రాంగణంలోని స్క్రాప్ ను దొంగతనం చేస్తూ అమ్ముకుంటున్నట్లు తెలిసిందని, చాలాసార్లు వారిని మందలించి ఈ పని చేయడం మంచి పద్ధతి కాదని చెప్పినట్లు పద్మ తెలిపారు.

అయినా అటెండర్ల తీరులో మార్పు రాలేదని.. ఈ విషయం ఉన్నతాధికారులకు సైతం తెలిపి ఇటీవలే ఓ అటెండర్ను విధుల్లోంచి తొలగించినట్లు ప్రాంగణం అధికారిని పద్మ తెలిపారు. మహిళా ప్రాంగణంలోని స్క్రాప్ ను మాయం చేసి అమ్ముకుంటున్న విషయంలో విధుల్లోంచి తొలగించిన అటెండర్ తనపై కక్షగట్టి విషప్రయోగం చేయడం, మంచి విషయం కాదని, తన వల్లే జిల్లాలో అధికారులకు ఎన్నో సందర్భాల్లో ఇలాంటి ప్రాణహానులు జరిగే ఆస్కారం ఉందన్నారు.తనకు ప్రాణహని ఉందని తనపై విష ప్రయోగం చేసిన అటెండర్లను అదుపులోకి తీసుకొని వారి వెనకాల ఎవరు ఉన్నారో తేల్చి వారందరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రాంగణమాధికారి పద్మ తెలిపారు.

విష ప్రయోగ విషయం ఆర్మూర్ పోలీసులకు పిర్యాదు చేసిన పట్టించు కోవడం లేదని జిల్లా ప్రాంగణం అధికారిని పద్మ అవేదన వ్యక్తం చేశారు. జిల్లా ప్రాంగణం అధికారిపై విషప్రయోగం జరిగిన సంఘటన సైతం ప్రాంగణ అధికారిని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్మూర్ ప్రాంత విలేకరులకు చెప్పకుండా దాచి ఉంచిన ఆర్మూర్ పోలీసులపై ఆర్మూర్ జర్నలిస్టులందరూ ఒకింత గుస్సా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆర్మూర్ పోలీస్ అధికారులు స్పందించి జిల్లా పెర్కిట్ మహిళా ప్రాంగణం అధికారిని పద్మపై విష ప్రయోగం చేసిన వారిపై వారి వెనుక ఉన్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Similar News