చైర్మన్, కార్యదర్శి తీరు పై సభ్యుల అసహనం

పోతంగల్ మండల కేంద్రంలోని విశాల సహకార పరపతి సంఘం పాలకవర్గంలోని 9 మంది బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన డైరెక్టర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు.

Update: 2024-02-05 15:28 GMT

దిశ కోటగిరి /పోతంగల్ : పోతంగల్ మండల కేంద్రంలోని విశాల సహకార పరపతి సంఘం పాలకవర్గంలోని 9 మంది బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన డైరెక్టర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. ఇది మండలంలో హాట్ టాపిక్ గా మారింది. సంఘ కార్యదర్శి తీరును నిరసిస్తూ గతంలో డీసీఓ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా పాలక వర్గంలో చైర్మన్ తో కలిపి 13 మంది సభ్యులు ఉండగా చైర్మన్, సంఘ కార్యదర్శి ఏకపక్ష నిర్ణయాలు, అవినీతిని నిరసిస్తూ సోమవారం తొమ్మిది మంది బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన డైరెక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు సంఘ కార్యదర్శి కి తమ రాజీనామా పత్రానందించారు. 


Similar News