సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

జుక్కల్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోయా కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు ప్రారంభించారు.ఈ

Update: 2024-10-11 10:13 GMT

దిశ, జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోయా కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..ప్రభుత్వం సోయా పంటకు క్వింటాలుకు రూ.4,892/- మద్దతు ధర ప్రకటించిందన్నారు . రైతులందరూ తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. దళారులను నమ్మి మోసపోవదన్నారు. ఆరు గాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతు బాగుంటేనే అందరం బాగుంటామన్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని తెలిపారు. ప్రజా ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేస్తుందన్నారు. రైతు సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతామన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పట్ల చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. కాబట్టి మనమందరం అన్నదాతకు అండగా ఉండి కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా..పంటకు సరైన మద్దతు ధర వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పారు. రైతులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం మండల కేంద్రంలో అయ్యప్ప గుడి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటి సభ్యులు లక్ష్మీబాయి దాదారావు పటేల్, మాజీ మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ ఉమాకాంత్ దేశాయ్, సొసైటీ చైర్మన్ శివానంద్ పటేల్, బొంపెల్లి రాజుల సెట్, కౌలాస్ మాజీ సర్పంచ్ గొల్ల హన్మండ్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News