పరిహారం కోసం రెండు మూడు రోజులు ఎదురు చూద్దాం

నష్టపరిహారం కోసం రెండు మూడు రోజులు వెయిట్ చేద్దామని, అప్పటికి కూడా ప్రభుత్వం పరిహారం అందజేయని పక్షంలో ఆందోళనకు దిగుదామని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు.

Update: 2024-03-17 14:17 GMT

దిశ, భిక్కనూరు : నష్టపరిహారం కోసం రెండు మూడు రోజులు వెయిట్ చేద్దామని, అప్పటికి కూడా ప్రభుత్వం పరిహారం అందజేయని పక్షంలో ఆందోళనకు దిగుదామని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం భిక్కనూరు మండలం అంతంపల్లి, లక్ష్మీ దేవునిపల్లి గ్రామాలలో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు.

     ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందజేస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఒకవేళ పరిహారం అందజేయని పక్షంలో బాధిత రైతుల పక్షాన నిలబడి ఆందోళనకు దిగుదామన్నారు. రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేస్తే రైతులకు ఇటువంటి సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తేవి కావన్నారు. కురిసిన వడగండ్ల వర్షానికి కరెంటు సమస్యలు కూడా బాగా ఉన్నాయని, కరెంటు సరఫరా పునరుద్ధరణ కోసం ట్రాన్స్ కో సిబ్బంది చర్యలు చేపట్టారని, వారికి రైతులు సహకరించాలని కోరారు. ఆయన వెంట బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. 


Similar News