కామారెడ్డి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా లక్ష్మీ రాజా గౌడ్

కామారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ధర్మగోని లక్ష్మీ రాజగౌడ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-12-31 12:54 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ధర్మగోని లక్ష్మీ రాజగౌడ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్ చైర్మన్ గా మిన్కూరి బ్రహ్మానంద రెడ్డి, సభ్యులుగా అవుసుల బ్రహ్మం, లోకోటి సుదర్శన్ రావు, కల్లూరి భూమయ్య, గోగు జ్యోతి, ఎర్ర నారా గౌడ్, నాగారపు రాజలింగం, మహమ్మద్ మక్బూల్, నునావత్ గణేష్, కొత్త అరవింద్, జిల్లెల్ల భూపతి, వలిపిశెట్టి లక్ష్మీరాజం, దోమకొండ శ్రీనివాస్ తో పాటు..మాచారెడ్డి పిఎసిఎస్ చైర్మన్, జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్, మున్సిపల్ చైర్ చైర్మన్ లను సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చైర్మన్, వైస్ చైర్మన్ లకు నియామక పత్రాలు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అందజేశారు. కాగా త్వరలోనే నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


Similar News