అర్ధరాత్రి వరకు దుకాణం తెరిచిన యజమానికి జైలు

నిజామాబాద్ నగరంలో సిటీ పోలీస్ యాక్టు అమలు అవుతుండగా నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు దుకాణం తెరిచి ఉంచిన యజమానికి న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్ష విధించిందని నిజామాబాద్ ఒకటవ టౌన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు తెలిపారు.

Update: 2024-02-22 11:26 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో సిటీ పోలీస్ యాక్టు అమలు అవుతుండగా నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు దుకాణం తెరిచి ఉంచిన యజమానికి న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్ష విధించిందని నిజామాబాద్ ఒకటవ టౌన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు తెలిపారు. నగరంలోని బస్టాండ్ సమీపంలో గైక్వాడ్ సంతోష్ అనే వ్యక్తి నిర్ణిత సమయం దాటిన తరువాత దుకాణం తెరిచి ఉంచడంతో ఒకటవ టౌన్ పోలీస్ లు సిటీ పోలీస్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు. స్సెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఈ మేరకు గైక్వాడ్ సంతోష్ కు రెండు రోజుల కారాగార శిక్ష విధించారు. 


Similar News