దారుణం...బాలికను స్కూలులో వదిలిపెట్టమని అప్పగిస్తే....ఏం చేశాడో తెలుసా...

కనిపెంచిన కన్న తల్లిదండ్రులే తాము అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని కసాయి వాడి చేతికి అప్పాజెప్పారు.

Update: 2024-02-03 14:32 GMT

దిశ, బాన్సువాడ : కనిపెంచిన కన్న తల్లిదండ్రులే తాము అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని కసాయి వాడి చేతికి అప్పాజెప్పారు. పాఠశాలలో తన కూతురిని విడిచి పెట్టమని అప్పగించిన మైనర్ బాలికను లాడ్జి కి తీసుకువెళ్లి అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డి ప్రాంతానికి చెందిన బాలిక బాన్సువాడ లో

    చదువుతుంది. అదే ప్రాంతానికి చెందిన యువకుడు శనివారం బాన్సువాడకు వస్తుండగా బాలిక తండ్రి తన కూతురును యువకుడికి అప్పగించి పాఠశాలలో వదిలి పెట్టమని చెప్పాడు. దాంతో అతను బాన్సువాడలో (హనుమాన్) అంజి లాడ్జ్ కు తీసుకువెళ్లి బాలికను అత్యాచారం చేశాడు. దీంతో అమ్మాయి కేకలు వేయడంతో స్థానికులు 100కు డైల్ చేయగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని, అమ్మాయిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.


Similar News