ఆలూర్ లో ఫ్రైడే -డ్రై డే కార్యక్రమం

ఆలూర్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో,ఆరోగ్య ఉప కేంద్రాల్లో శుక్రవారం ఫ్రైడే -డ్రై డే కార్యక్రమం నిర్వహించారు.

Update: 2024-10-11 10:48 GMT

దిశ ఆలూర్ : ఆలూర్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో,ఆరోగ్య ఉప కేంద్రాల్లో శుక్రవారం ఫ్రైడే -డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సిబ్బంది ప్రజలకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ దినేష్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని,ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలన్నారు. ఇంటి పరిసరాలలో కొబ్బరి చిప్పలు,ప్లాస్టిక్ డబ్బాలు,పాత కుండలు,పనికిరాని వస్తువులను ఉంచుకోరాదని దానిలో వర్షపు నీరు పడి దోమల లార్వా వృద్ధి చెంది డెంగ్యూ,చికెన్ గున్యా,మలేరియా,ఫైలేరియా వంటి వ్యాధులు ప్రభలుతాయన్నారు. దోమ పుట్టుక గురించి,దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి దోమల నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ హెచ్పి బ్లెస్స్, ఏఎన్ఎంలు జామున, రాజగంగు,ఆరోగ్య కార్యకర్తలు జామున, నాగలత, పద్మ, భూలక్ష్మి, ఎలిజిబిట్ తదితరులు పాల్గొన్నారు.


Similar News