మాక్లూర్​లో భారీగా మద్యం పట్టివేత

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం కొత్తపల్లి బెల్ట్ షాప్ పై మంగళవారం టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు.

Update: 2024-03-19 10:11 GMT

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం కొత్తపల్లి బెల్ట్ షాప్ పై మంగళవారం టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీఐ అంజయ్య , సిబ్బంది లక్ష్మన్న, సుదర్శన్ , రాములు , అనిల్ కుమార్ లు బెల్ట్ షాప్ పై దాడి చేశారు. ఈ దాడిలో బెల్ట్ షాప్ లో 123.250 లీటర్ల (30,210 రూపాయల విలువ) లిక్కర్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం మాక్లూర్ ఎస్ హెచ్ ఓ కి అప్పగించారు. 


Similar News