కేసీఆర్ ఆధ్వర్యంలోనే గ్రామపంచాయతీలు, తండాల అభివృద్ధి..

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అన్ని గ్రామాలు, తాండాలు అభివృద్ధి చెందాయని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సిందే అన్నారు.

Update: 2023-06-21 11:18 GMT

దిశ, జుక్కల్ : తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అన్ని గ్రామాలు, తాండాలు అభివృద్ధి చెందాయని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సిందే అన్నారు. ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సిందే మాట్లాడుతూ మైదాపూర్ గ్రామానికి బీటీ రోడ్డు ప్రారంభోత్సవానికి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పటేల్ వచ్చారని ఆయన అన్నారు. మూడు కోట్ల 40 లక్షల రూపాయలతో రోడ్డు పనులు ప్రారంభం చేశామన్నారు. గ్రామాలు, తండాలు అభివృద్ధి చేయడం కేసీఆర్ ప్రభుత్వం లక్ష్యం అని ఆయన అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో జుక్కల్ నుండి సిద్దాపూర్ గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం చేశారని తెలిపారు. అదే లక్ష్యంతో సిద్దాపూర్ నుండి మైదాపూర్ వరకు బీటి రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన జరిగిందన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా మారుమారు గ్రామాలకు బీటీ రోడ్డు పనులు చేయలేదు అని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మాణం పనులు జరిగాయని అయినా అన్నారు.

ఈ సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పటేల్ మాట్లాడుతూ నేషనల్ హైవే 4 బీటీ రోడ్డు పనులు జరిగాయని ఆయన అన్నారు. సంగారెడ్డి నుండి మహారాష్ట్ర వరకు నాలుగు వసర రోడ్డు పనులు పూర్తి అయ్యాయని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేసిన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పటేల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సిందే ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుర్నర్ యశోద నీల్ పటేల్, జెడ్పీటీసీ సభ్యులు లక్ష్మీబాయి దాదారావు పటేల్, గ్రామ సర్పంచ్ సంజీవ్, మాజీ మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయ గౌడ్, మాజీ ఎంపీటీసీ బిట్టు పటేల్, జుక్కల్ సొసైటీ చైర్మన్ శివానంద్ పటేల్ జుక్కల్ సర్పంచ్ బొంపల్లి రాములు, జుక్కల్ మాజీ సర్పంచ్ గంగాధర్ నాగుల్ గావ్ సర్పంచ్ కపిల్ పటేల్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాధవ దేశాయ్, గ్రామస్తులు, గిరిజన మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News