అభివృద్ధి పనులకు నిధులు మంజూరు
ఆర్మూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనట్లు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు .
దిశ,ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనట్లు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణ అభివృద్ధి, స్త్రీ-శిశు శాంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ను చాంబర్ లో కలిసి నిధులు మంజూరు చేయాలని కోరగా..స్పందించి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.ఆర్మూర్ మండలం మంథని నుండి రాంపూర్ వరకు 4.7 కిలోమీటర్ల రోడ్డు ను 4.40 (నాలుగు కోట్ల నలబై లక్షలు) తో,మాక్లూర్ మండలానికి సంబంధించిన రోడ్డు మెట్టు గొట్టిముకల మీదుగా ఆంధ్రనాగర్,లక్నపూర్ ఇంద్రనగర్ వరకు 3.85 కిలోమీటర్ రోడ్డును 2.3 (రెండు కోట్ల మూడు లక్షల)తో పాటు నందిపేట్ మండలానికి సంబంధించిన రోడ్డు నందిపేట్ రోడు నుండి ఎల్లమ్మ దేవాలయం వరకు 2.00 కిలోమీటర్ లకు 2 కోట్లు రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. ఇవే కాకా ఆర్మూర్ నియోజకవర్గనికి సంబంధించిన ఆయా గ్రామలకి సంబంధించిన 21బిటి రోడ్లను 19.87 (పందొమ్మిది కోట్ల ఎనబై ఏడూ లక్షల )లతో రినివాల్స్ చేయాలని మంత్రిని కోరారు.ఈ మేరకు నిధులు మంజూరు చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.